మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్16 మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగదేశం పార్టీ కో-ఆర్డినేటర్లుగా సీనియర్ నాయకులు వగ్గు చంద్రశేఖర్ రావు,కరణం గోపి,పిట్ల రామకృష్ణ ముదిరాజ్ లను రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియమించి నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మాపై నమ్మకంతో మల్కాజిగిరి కోఆర్డి నేటర్లుగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర నాయకులు ఏ కార్యక్రమం ఇచ్చిన పార్టీ కోసం పని చేస్తు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో గొల్లగూడ శ్రీనివాస్,గుంటి భీం రాజ్, సర్వేష్ యాదవ్,నాగమణి,బాలకృష్ణ, కొమురయ్య,రమేష్,సుధాకర్, మాల్యాద్రి,సుమన్ బాబు,వరుణ్, మధు,లక్ష్మణ్,ఈశ్వర్,మాధవ్,శివ నరేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




