బహుజన ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించిన ఉపాధ్యాయులు
తిమ్మాపూర్, అక్టోబర్ 30 (అక్షరం న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఆదివారం ఎస్సీ మాల కులానికి చెందిన మోకాళ్ళ నర్మదా పదవ తరగతి విద్యార్థినికీ బహుజన ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్నెంపెల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య చేతుల మీదుగా 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందించిన దాతలు తమ్మిడి సుధీర్, తుమ్మనపల్లి కోదండపాణి, బత్తుల అంజయ్య, కాటిక సంపత్, జట్టి రవీందర్, ఏల కిషన్, బహుజన ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షులు మానుపాటి రాజయ్య వీరందరూ ఉపాధ్యాయులు కలిసి అమ్మాయికి తల్లిదండ్రులు లేరు ఒక పిల్ల ఉండడం వల్ల తమ దాతృతత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మన్నెం పల్లి గ్రామ నాయకులు రావుల శ్రీనివాస్ గౌడ్, మల్లాపూర్ కుటుంబానికి చెందిన మోకాళ్ళ తిరుపతి, తదితరులు పాల్గొని విద్యార్థినికి ఆర్థిక సాయం చేయడం జరిగింది.




