500 మందికి ఉచిత వైద్య సేవలు
…
జనం సాక్షి జోగిపేట్అందోల్ మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో కూకట్ పల్లి కి చెందిన ఐకాన్ ఆసుపత్రి, జోగిపేట లైన్స్ క్లబ్ సంయుక్తంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి చెందిన డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ వీరన్న, డాక్టర్ షిఫాలీ, డాక్టర్ అలేఖ్య, షబానా, స్వాతి, ఏకయ్య లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 500 మందికి వైద్య సేవలు అందించినట్లు వారు తెలిపారు. శిబిరంలో చాలామంది కాళ్ల నొప్పుల బారిన పడినట్లు వారు గుర్తించారు. షుగర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేశారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందులత మల్లప్ప, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఆకుల రాంబాబు, జిల్లా కార్యదర్శి (డయాబెటిక్) డాక్టర్ కే. అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, ఉపసర్పంచ్ నాగప్ప, మాజీ సర్పంచ్ శివరాజ్, మాజీ ఎంపిటిసి రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
500 మందికి ఉచిత వైద్య సేవలు




