యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలంతుర్కపల్లి, జనవరి 26(జనంసాక్షి న్యూస్) :74 గణతంత్ర దినోత్సవ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు, గ్రామ సర్పంచ్ దుబ్బల శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు ,స్కూల్ చైర్మన్ పులిగిల్ల నాగలక్ష్మి, గ్రామ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పులిగిల్ల స్వామి 6టీవీ విలేకరి నోట్ బుక్స్ ను మరియు పెన్నులు, పెన్సిల్ లు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మహానుభావుడని కొనియాడారు రాజ్యాంగం గొప్పతనం గూర్చి వివరించారు కార్యక్రమంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ,ప్రభుత్వ అధికారులు, నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




