సిఐటియు జిల్లా మహాసభల గోడపత్రిక విడుదల
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (20): మండలంలోని గోపాల్ పేట్, తాడిపర్తి, గ్రామాలలో సిఐటియు జిల్లా మహాసభల గోడపత్రికలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన సిఐటియు వనపర్తి జిల్లా మహాసభలు కొత్తకోట క్యూఆర్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని అలాగే 25వ తేదీన కొత్తకోట జూనియర్ కళాశాల నుండి అన్ని రంగాల కార్మికులతో భారీ ప్రదర్శన, కొత్తకోట బస్టాండు ఎదురుగా బహిరంగ సభ జరుగుతుందని ఈ మహా సభలకు జయప్రదం చేయాలని వారన్నారు ఈ బహిరంగ సభకు వనపర్తి జిల్లాలోని 14 మండలాల అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, ఆశా వర్కర్లు, హమాలీలు, ఐకెపి వివో ఏలు,భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మిషన్ భగీరథ కార్మికులు, వీఆర్ఏలు, వివిధ రకాల డ్రైవర్స్ బీడీ కార్మికులు మధ్యాహ్నం భోజనం కార్మికులు తదితరులు అన్ని రంగాల ఉద్యోగులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కుర్మయ్య, నాయకులు సుధాకర్, నిరంజన్, వెంకటయ్య, రాములు, ఎల్లయ్య, రాజు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు




