భైంసా రూరల్ ఏప్రిల్ 24జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణం మిర్జాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న టిఎస్ఎస్పి బేటాలియన్ టు సబ్ క్వాటర్స్ నిర్మాణ పనులను సోమవారం టిఎస్ఎస్పి బేటాలియన్ అదనపు డిజిపి స్వాతి లక్రా పరిశీలించారు. జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ మొదటి వారం లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, భైంసా ఏఎస్పీ కాంతి లాల్ పాటిల్ భైంసా డివిజన్ పోలీస్ శాఖ అధికారులు, టిఎస్ఎస్పి అధికారులు పాల్గొన్నారు.




