కెఎస్అర్ ట్రస్ట్ దోమ మార్చి 31(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని,మోత్కూరు తమ స్వంత గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గట్టు నర్సమ్మ వృద్ధురాలు నిన్న అకాల మరణం చెందారు.ఈ విషయం తెలుసుకొన్న వెంబడి స్పందించి కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వారికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని నింపుతూ, అంత్యక్రియల తక్షణ అవసరాల కొరకై మనువడు అయిన గట్టు శ్రీనివాస్ గారికి 10,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి,కండక్టర్ మల్లయ్య, కోత్త పేట వెంకటయ్య, మోగులయ్య,అంజీలయ్య,చెన్నయ్య,నర్సింహులు,చెంద్రయ్య,ఇస్వయ్యా,రాములు, వెంకటయ్య, యాదయ్య,చెంద్రయ్య,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం




