Monday, 2 November 2026

మాజీ స్పీకర్ మీరా కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు

మాజీ స్పీకర్ మీరా కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులుజహీరాబాద్ మార్చి 30 (జనం సాక్షి) డిల్లీలోని భారత సామాజిక దార్శనికుడు, స్వతంత్ర భారతదేశంలోనే కాక, బ్రిటిష్ ఇండియాలో సైతం ఏకైక రాజకీయ దురంధరుడు, మాజీ ఉప ప్రధాని డా,, బాబుజగ్జీవన్ రాం రాజకీయ వారసురాలు, అత్యుత్తమ స్పీకర్ మీరా కుమార్  78వ జన్మదినోత్సవాలు  డిల్లీలోని డా.బాబు జగ్జీవన్ విద్యా భవన్ నందు ఘనంగా జరిపారు.  కార్యక్రమానికి ఎమ్మార్పియస్ జహీరాబాద్ మాజీ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ ఆధ్వర్యంలో…మాతంగి చిరంజీవి జె.నర్సిములు, కాశీంపూర్ ఉల్లాస్, ఎ.రాజు,లు వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి తదనంతరం వారికి గుర్తుగా ఒక బహుమతిని తన బృందంతో అందించటం జరిగిందని అబ్రహాం మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.