Thursday, 5 November 2026

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మునుగోడు నవంబర్24(జనం సాక్షి):
తమతో చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో అకాల మృతి చెందాడన్న విషయం తెలిసి చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకుని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సాయాన్ని చేయాలని నిర్ణయించారు.ఈ మేరకు నగదును సేకరించిన మొత్తాన్ని మిత్రుడి భార్యకు అందజేశారు.వివరాల్లోకి వెళ్తే మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన నీలకంఠం శంకర్ ఇటీవల మృతి చెందాడు.పదో తరగతి 2010సం,చెందిన బాల్యమిత్రులంతా కలిసి మృతుని కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో రూ.25వేలును సేకరించారు. ఆనగదును ఆదివారం స్నేహితుని భార్యకు అందజేశారు.ఇందులో బాల్య మిత్రుల బృందం సభ్యులు ఉన్నారు.అదేవిధంగా గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కింగ్స్ యూత్ సభ్యులు10 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు.