జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదర్శనగర్ కు చెందిన రజిత భర్త అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెంది, వారి పిల్లలు ప్రమాదంలో గాయపడగా, సదురు బాధిత కుటుంబానికి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు కమాన్ పూర్ ఎంపిటిసి- 1 కోలేటి చంద్రశేఖర్ 25 కిలోల బియ్యంతో పాటు స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు 25 కిలోల బియ్యంతో పాటు మూడు వేల ఆర్థిక సహాయాన్ని గురువారం బాధిత కుటుంబ సబ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, జూలపల్లి ఉపసర్పంచ్ పోల్దాసరి సాయి కుమార్, జూలపల్లి ఎంపిటిసి- 2 తనయుడు అబ్బిడి సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చొప్పరి శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




