Saturday, 7 November 2026

మీ వెన్నంటూ నేనుంటా అంటున్న శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశీరాం నాయక్

మీ వెన్నంటూ నేనుంటా అంటున్న శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశీరాం నాయక్

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

డోర్నకల్ డిసెంబర్ 23 (జనం సాక్షి)

డోర్నకల్ మండలం హున్య తండా గ్రామానికి చెందిన అనారోగ్యంతో మృతి చెందిన భూక్య గిల్లి,రాము తండా కు చెందిన గుగులోత్ బావసింగ్,ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూక్య సురేష్ వారి కుటుంబానికి పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రగాఢ సానుభూతి తెలిపి మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశీరాం నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హున్య తండా గ్రామ ప్రజలకు మీ వెన్నంటూ నేనుంటా అని, ప్రజలకు సేవ చేయాలని మానవ దృక్పథంతో ప్రజాసేవే అంకితమని అంటున్న శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశిరం నాయక్.ఆయన వెంట వార్డు మెంబర్లు భూక్య డిజె శ్రీనివాస్, ధరావత్ సీతారాం, డోర్నకల్ మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ బానోత్ అర్జున్ నాయక్,జాటోత్ లాలు,భూక్యా సుమన్,భూక్య రాంబాబు,బానోత్ కుమార్,మోతిలాల్, గూగులోత్ బిచ్చ,బర్మావత్ రవి, బోడ మోతిలాల్, రాము, బావసింగ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.