బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన తోట లక్ష్మి (50) ఇటీవల చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాంతో పాటు మర్రి రాజేశ్వర్ బిజెవైఎం ఉదయ్ సాబ్లే బాల్ సింగ్ స్వామి యువకులు తదితరులు ఉన్నారు.