బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
దంతాల పల్లి జూలై 4 జనం సాక్షి
మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వెంకన్న కుటుంబానికి తను,టీఅర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నందారపు రామచంద్రయ్య, స్థానిక ఎంపీటీసి చిట్టి మధుసూదన్ రెడ్డి, నాయకులు చిట్టి రమేష్ రెడ్డి, జనిగల వెంకన్న,లక్ష్మణ్, సుమన్ లతో పాటు మృతుని కుటుంబ సభ్యులు రాపాక అశోక్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.