కమాన్ పూర్, జనం సాక్షి: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త తూర్పాటి సమ్మయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మోనారి వెంకటమ్మ ఇటీవల మరణించగా సదరు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీ. ఆర్. ఎస్ మండల శాఖ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇనంగంటి భాస్కర్ రావు, ప్రజాప్రతినిధులు నీలం సరిత, బొల్లపెల్లి శంకర్ గౌడ్, నాయకులు గడప కృష్ణమూర్తి, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, పెండ్లి నారాయణ, నడిగొట్టు సంపత్, గోడిసేల లింగస్వామి, చిగురు భూమయ్య, గుమ్మడి కొమురయ్య, వంగ రవి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




