.
బెల్లంపల్లి, ఏప్రిల్ 5, (జనంసాక్షి )బాపూజీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తలచుకోవడం అంటే నాటి సామాజిక ఉద్యమాలను స్మరించుకోవడమేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ( సి ఓ ఈ) బెల్లంపల్లి ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. బుధవారం గురుకులంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంత్యుత్సవాల్లో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే అసమానతలను వివక్షతను ఎదిరించే తిరుగుబాటు తత్వం కలిగిన జగ్జీవన్ రామ్ ఆలోచనలు నేటికీ అనుసరణీయమన్నారు.
సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకు దిశ నిర్దేశం చేసిన బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి దశ నుండే గొప్ప నాయకుడుగా ఎదిగారన్నారు. నాటి సమాజంలో కులం పేరుతో చూపెట్టిన వివక్షతలను ప్రశ్నించి సమానత్వాన్ని కాంక్షించారన్నారు. అలుపెరగని ఆయన రాజకీయ జీవితంలో చివరి కంట మచ్చలేని నాయకుడిగా సమ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించిన గొప్ప రాజకీయవేత్తగా నిలిచారన్నారు. అంతేకాకుండా చరిత్రని లోతుగా అధ్యయనం చేసిన అధ్యయనశీలిగా బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచనలు నేటికీ ఆదర్శనీయమన్నారు.
కార్యక్రమంలో ముందుగా డాక్టర్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో లైబ్రేరియన్ ఎండి కౌసర్, కాసర్ల రాజేందర్, అధ్యాపకులు శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీనారాయణ, ప్రేమలత, వ్యాయామ ఉపాధ్యాయులు రాకేష్, వామన్ , తదితరులు పాల్గొన్నారు




