బాపూజీ నగర్ లో సైడ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించిన ఎంపీపీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ నగర్ లోని మాతృ శ్రీ స్కూల్ లైన్ లో సైడ్ డ్రైనేజ్ పనులను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో సినరేజ్ గ్రాంట్ నుండి 2 లక్షల 76 వేలు మంజూరు చేసి, సైడ్ డ్రైన్ నిర్మిస్తున్న పుట్ట మధూకర్ కి బాపూజీ నగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం సరిత, కమాన్ పూర్ ఏ.ఎం.సి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, కమాన్ పూర్ ఎంపీటీసీలు బోనాల వెంకటస్వామి, కోలేటి చంద్రశేఖర్, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనగంటి రామారావు, బొమ్మగాని అనిల్ గౌడ్, తోట వీరయ్య, గడప కృష్ణమూర్తి, మేడగొని విజయ్ గౌడ్, జంగపల్లి లక్ష్మణ్, కమ్మగోని అనిల్, గొడిశెల స్వామి, గడ్డం ప్రకాష్, ఎండీ. నజీబ్, మెరుగు కుమార్, గొడిశెల లింగస్వామి, పోతుల శివ, మాటేటి కుమార్, గోస్కి వరప్రసాద్, జంగపల్లి సంతోష్, అనిల్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు