రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం- బి ఆర్ ఎస్ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ శివయాత్ర నిర్వహించారు అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డికి రైతుల బుద్ధి చెప్తారని వారి హెచ్చరించారు రైతులకు వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు తెలిపారు రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి,ఏడుపాయల డైరెక్టర్ యాద గౌడ్, మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్, కోనాపూర్ సర్పంచ్ రమేష్,ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, మండల గౌడ సంఘం అధ్యక్షులు వెంకట్ గౌడ్, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు రాజా గౌడ్, వేమారెడ్డి, తలారి దుర్గేష్, బండి రమేష్, సోమ నరసింహులు, దొడ్ల ఆంజనేయులు,బూతి పురం శేఖర్, వడ్ల శీను, దుర్గేష్ గౌడ్, రవీందర్ గౌడ్, దుర్గ ప్రసాద్ గౌడ్, చలం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.