మద్యం షాప్‌లను తనిఖీ చేసిన ఆబ్కారి శాఖ ఎస్సై బాలయ్య.
కోటగిరి డిసెంబర్ 16 జనం సాక్షి:-పోరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని విక్రయిస్తే చట్టమైన చర్యలు తప్పవని ఆబ్కారి శాఖ ఎస్సై బాలయ్య తెలిపారు. శుక్రవారం రోజున ఉమ్మడి కోటగిరి మండలంలోని పోతంగల్,కోటగిరి గ్రామాలలోని వైన్స్ షాప్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ రేట్లను,బాటిల్ బార్‌కోడ్‌లను స్కానింగ్ చేసి రికార్డులను ఆయన పరిశీలించారు.ఈ తనికిలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్,
కానిస్టేబు ల్ సుదర్శన్ పాల్గొన్నారు.




