Sunday, 8 November 2026

బాలలు భావి భారతావనికి ప్రతిబింబాలు..

బాలలు భావి భారతావనికి ప్రతిబింబాలు..

 

– స్ఫూర్తి నింపిన బాలల హక్కుల వారోత్సవాలు..

– బేటి బచావో బేటి పడావో పై అవగాహన

– ఊయల కార్యక్రమం ద్వారా మరింత అవగాహన

– సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన బాల బాలికలు.

-కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..

హన్మకొండ బ్యూరో చీఫ్ 26 జనంసాక్షి

బాలలు భావి భారతావనికి ప్రతిబింబాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు, అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా శనివారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల తీర్మాణంతో బాలల హక్కుల ఒడంబడికను (కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్) ఆమోదించిన అనంతరం 1992 నుండి అట్టి నిబంధనలు భారత దేశం అమలు చేస్తుందని, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు ప్రధానమైనవని, అయితే ఆడ పిల్లల పట్ల వివక్ష చూపెడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ ద్వారా పుట్టబోయేది ఆడా, మగ తెలుసుకొని, ఆడ పిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యలకు పాల్పడడం బాధాకరమని,తద్వారా జీవించే హక్కును కోల్పోతున్నారని, ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మరో పక్క ఇలాంటి వివక్ష కొనసాగితే లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటుందని,తద్వారా ఆడపిల్లలు లేని సమాజం చూడాల్సి వస్తుందని, అడ మగ ఎవరైనా సమాన అవకాశాలు కల్పిస్తే బాలురతో పాటు బాలికలు రాణిస్తారని అన్నారు,
స్వచ్ఛంద సంస్థలు కూడా బాల్య వివాహాల నిర్మూలన, అక్రమ దత్తత నివారణ, బాలల అక్రమ రవాణా అరికట్టుటలో క్రియాశీలక పాత్ర పోషించాలని,
బాలల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, బాలల సంరక్షణ కేంద్రాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు,
అవార్డ్ పొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత పనిచేసి బాలల రక్షణను సామాజిక బాధ్యతగా భావించి పనిచేయాలని అన్నారు, వదిలి వేయబడిన పిల్లల రక్షణ సంరక్షణ కోసం జిల్లాలో ఊయల కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ అనిల్ చందర్ రావు మాట్లాడుతూ నవంబర్ 14 నుండి 26 వరకు జిల్లాలోని కేజీబివి, సంక్షేమ గురుకుల పాఠశాలలో మరియు పలు ప్రభుత్వ పాఠశాలలలో బాలల హక్కుల గురించి విస్తృత ప్రచారం చేయడం జరిగిందని, అలాగే అన్ని పోలీస్ స్టేషన్ లోని ఎస్హెచ్వో లకు చైల్డ్ లైన్ సే దోస్తీ రిస్ట్ బాండ్ లను కట్టించి 1098 ప్రాముఖ్యతను తెలియచేయడం జరిగిందని, వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన ఏఎన్ఎం ఆశా వర్కర్ల కు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం పై అవగాహన కల్పించామని అన్ని శాఖల సమన్వయంతో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు,
సందర్భంగా గ్రామ మండల పట్టణ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ లలో క్రియాశీలక పాత్ర పోషించిన అధికారులు, ప్రజాప్రతినిధులను, మరియు స్వచ్ఛంద సంస్థల,బాలల సంరక్షణ కేంద్రాల ప్రతినిధులను నగదు పురస్కారం, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించడమైనది,
మాదే ఈ తరం అంటూ నృత్యం చేసిన ప్రభుత్వ బాలికా సదనం పిల్లలు, మరియు ఆయా స్వచ్ఛంద సంస్థలకు చెందిన బాల బాలికల నృత్యాలు అలరించాయి, మల్లికాంబ, స్పందన మనోవికాస, ఆసుంతా ఆశా నిలయం కేంద్రాల పిల్లల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి,
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, పరికి సుధాకర్, బాలల న్యాయ మండలి సభ్యులు డాక్టర్ కే గోపికా రాణి, మెరుగు సుభాష్, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష,
సిడిపివోలు కే మధురిమ, ఎం బి భాగ్యలక్ష్మి, సీనియర్ సహాయకులు వి వెంకట్ రామ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఏం మౌనిక,ఎల్సీపివో అన్నపురం సతీష్, జిల్లా ప్రోబేశన్ ఆఫీసర్ రాధ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్మెన్ లు కే అనితా రెడ్డి, మండల పరశు రాములు, బాలసదనం సూపరిండెంట్ కల్యాణి,ట్సూపర్ వైజర్ లు రాజ్యలక్ష్మి లు, ప్రసూన, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డీనేటర్ ఎం డి ఇక్బాల్ పాషా, కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి,బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఎం శ్రీనివాసులు,జీ సునీత,సంగి చైతన్య,కౌన్సిలర్ ఏ మాధవి, డి నగేష్,
పి విజయ్ కుమార్, శివ ప్రసాద్,సీత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నార.