భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి నిదర్శనం
సర్పంచ్ జన్నాయికోడె నగేష్
ఆత్మకూర్ (ఎం) నవంబర్ 26 (జనంసాక్షి) దేశ ప్రజల అభ్యున్నతికి అంబేద్కర్ గారు రచించిన భారత దేశ రాజ్యాంగం 26 నవంబర్ 1949న అమలు లోకి వచ్చిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని స్థానిక ఆత్మకూరు ఎం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జన్నాయికోడే నగేష్ ఆధ్వర్యంలో పాలకమండలి సిబ్బంది ప్రజలతో కలిసి చేసిన రాజ్యాంగ ప్రతిజ్ఞ ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R అంబేడ్కర్ అణగారిన బడుగు బలహీనవర్గాలకు ఆడపడుచులకు భవిష్యత్తులో ఎలాంటి అవమానాలకు అసమానతలకు గురికాకుడదు అనే సంకల్పంతో అలనాటి పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ కమిటీ సభ్యుల సలహాలు సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా లేని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగాన్ని అమలు లోకి తీసుకురావడం మన దేశానికి గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కో ఆప్షన్ మెంబర్ యాస లక్ష్మారెడ్డి మల్లం సత్యనారాయణ వేముల నర్సింహా కొండపల్లి ముత్యాలు బాసాని శంకర్ మజ్జిగ బాలరాజు రాగటి శ్రీను కల్వల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు




