వీణవంక జనవరి 30 (జనం సాక్షి) వీణవంక శిశు సంక్షేమ శాఖ ఐ సి డి ఎస్ వారి అధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీణవంక మండల వైస్ ఎంపీపీ రాయీశెట్టి లత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలల హక్కులు,ముఖ్యంగా బాలిక సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న పతకాలను, బాలికల విద్య కోసం కస్తూరిబా బాలికల, గురుకుల పాఠశాల లును ఏర్పాటు చేశారు అని, వారి రక్షణ మరియు అభివృది కోసం తీసుకుంటున్న చర్యలను,వాటి పరిరక్షణ చట్టలైన పోక్సో 2012 చట్టం మరియు చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ, బాల్య వివాహాల నిరోధ చట్టం 2006 వంటి వాటి పైన అవగాహన కల్పించారు.బాలల కు ఏదైనా ఆపద ఉంటే 1098,100 ,181 ఉచిత టోల్ ఫ్రీ నంబరను ఉపయోగించుకోవాలని అని అన్నారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజీ రెడ్డి, చైల్డ్ లైన్ 1098 సభ్యులు దూడం కుమారస్వామి, సూపరవైజర్ శశి కిరణ్మయీ,శ్యామల,అంగన్వాడి టీచర్స్ , కళాశాల టీచర్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




