బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ పరిస్థితి విషమం

ముంబయి: ప్రముఖ వస్తాద్‌, కుస్తీ వీరుడు, బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన చేశారు. ఆయన శరీరంలోని బాగాలు ముఖ్యంగా మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడంలేదని వెల్లడించారు. 83 ఏళ్ల సింగ్‌ గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. మెదడులో కూడా హెమరేజ్‌ ఏర్పడిందని వైద్యులు తెలియజేశారు. కృతిమ శ్వాసను అందిస్తోన్నామని చెప్పారు. ప్రముఖ దర్శికుడు రామానంద సాగర్‌ నిర్మించిన రామాయణ్‌ సీరియల్‌లో దారాసింగ్‌ హనుమాన్‌ పాత్ర పోషించారు. ఇంకా కింగ్‌కాంగ్‌, పౌలద్‌, జబ్‌విమెట్‌ లాంటి చిత్రాల్లో కూడా నటించారు.