Tuesday, 3 November 2026

బాలుడికి మెరుగైన వైద్యం అందించాలి – జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్న కారుపాకల సిద్ధార్థ్ (7) ను సోమవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు.