Wednesday, 4 November 2026

బాల్కొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోషల్ ఆడిట్ గ్రామ సభ

బాల్కొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోషల్ ఆడిట్ గ్రామ సభ

బాల్కొండ జనవరి 9 (జనం సాక్షి ) బాల్కొండ మండలం కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రోజున సర్పంచ్ భూస సునీత ,ఎంపీడీవో సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ వాహబు, ఏ. పి.ఓ. ఇంద్ర ,పంచాయతీ కార్యదర్శి నరసయ్య, బి. ఆర్ పి మహమ్మద్ డి ఆర్ పి సుధాకర్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది,
ఈ గ్రామ సభ నిర్వహించడం గ్రామపంచాయతీ పాలకవర్గానికి ,నాయకులకు గ్రామ పెద్దలకు సమాచారం లేకుండానే నిర్వహించినట్లు సమాచారం తేదీ 01- 11 -2019 నుండి 31-03- 22 వరకు ఉపాధి హామీలో జరిగిన పనులు గత నాలుగు రోజుల నుండి తనిఖీ చేసి సేకరించిన వివరాలను ఈరోజు గ్రామ సభలో తనిఖీ బృందం తెలపడం జరిగింది మూడు సంవత్సరాల లో కూలీలకు చెల్లించిన మొత్తం 97,69,,129 రూపాయలు మెటీరియల్ ఖర్చు 12,34,785 రూపాయలు, మొత్తము రూపాయలు 1,10,03,914 చెల్లింపులు జరిగినయని తనిఖీ బృందం తెలపడం జరిగింది , పనికి వెళ్లకుండానే డబ్బులు చెల్లింపులు , నాలుగు రోజులు కూలీ పనికి వెళ్తే ఐదు రోజుల కూలి డబ్బులు ఇప్పించడం నాలుగు రోజులు కూలీ పనికి వెళితే మూడు రోజుల డబ్బులు చెల్లించడం , మాస్టర్ లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం , కమ్యూనిటీ ప్లాంటేషన్, ఏవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు చనిపోయినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ నాయకులు లింగ గౌడ్ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్ వార్డ్ సభ్యులు, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు గ్రామపంచాయతీ సిబ్బంది తనిఖీ బృందం సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.