బాల్కొండ ఫిబ్రవరి 13 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాల్కొండ ఎంపీపీ లావణ్య ,ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏం.ఆర్.ఓ. వినోద్, వైస్.ఏం. పి.పి. శ్రీకాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు పలు సమస్యల గురించి అధికారులకు తెలిపారు. ఈ సమస్యలపై అధికారులు ప్రజా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. బాల్కొండ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ వివరణ ఇవ్వగా మండల కేంద్రంలో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని సమాచారం అందించిన గాని విద్యుత్ శాఖ ఏఈ గా మీరు స్పందించకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ఫయాజ్ అలీ అన్నారు , ఇటీవల విద్యుత్ స్తంభాన్ని డ్రైనేజీ ధ్వంసం చేసి డ్రైనేజీలోపల ఏర్పాటు చేయడంపై వివిధ పత్రికలలో కూడా రావడం జరిగిందని దానిపై కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం పైగా సర్వ సభ్య సమావేశంలో నాకు ఆ విషయం తెలియదని ఏఈ శ్రీనివాస్ చెప్పడం గమనార్హం.ఇది ఇలా ఉండగా ఐసిడిసి గా వ్యవహరిస్తున్న శ్రీదేవి విధి నిర్వహణలో సమయపాలన పాటించడం లేదని సమావేశాలకు హాజరు కాకుండా ఉండటం కిసాన్ నగర్ గ్రామంలో ఇటీవల నిర్మించిన నూతన అంగన్వాడి కేంద్రాన్ని అధికారులకు,నాయకులకు, ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడం జరిగిందని కిసాన్ నగర్ ఏం. పి.టి.సి. తెలుపగా ఎంపీ డి వో సంతోష్ కుమార్ ఇలాంటివి జరుగకుండా ప్రోటాకల్ పాటించాలని సూపర్వేజర్ కు సూచించారు ,ఈ కార్యక్రమంలో ఏ. పి.ఓ. ఇందిరా, ఏం. ఈ. ఓ రాజేశ్వర్, ఏం. పి.ఓ. వెంకటేశ్వర్లు, ఏ. పి.ఏం. గంగాధర్, ఐసిడిసి సూపర్వేజర్ శ్రీదేవి, ఏ. ఈ. అనిల్, వివిధ శాఖల ఏ. ఈ. లు, సర్పంచులు, ఏం.పి.టి.సి.లు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




