Wednesday, 4 November 2026

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 31 మంది ఆడపడుచులకు కళ్యాణాలక్ష్మీ,షాధి ముబారక్ చెక్కులు పంపిణీ

 

 

 

 

బాల్కొండ ఫిబ్రవరి 13 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ,షాధి ముబారక్ చెక్కులను శనివారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,సర్పంచి భూస సునీత,తహశీల్దార్ వినోద్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చేతుల మీదుగా బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి),చిట్టాపూర్,బోదెపల్లి, జలాల్పూర్,నాగపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన 31 కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈసందర్భంగా మండల నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్నీ ప్రవేశ పెట్టారని ఒక్కొక్క లబ్దిదారులకు రూ1 లక్ష ఒక వంద పదహారు రూపాయలు చొప్పున అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పేద కుటుంబాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తోబుట్టువుగా ఉన్నారని ప్రతీ ఒక్క ఆడపడుచుకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈకార్యక్రమంలో సర్పంచి లు నోముల రవి,చాట్లపల్లి వనజ-గోవర్ధన్ గౌడ్,గడ్చందా కల్పన-అనిల్,పెంటు లింబాద్రి,నాగులపల్లి భూదేవి కిషన్,సంతకుల సాయమ్మ-జువ్వన్న,ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ-పోశెట్టి,EP నారాయణ,అనుగుల రాంరాజ్ గౌడ్,సనుగుల కవిత-శ్యామ్ సుందర్,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌట్ గంగాధర్,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,పస్తం చిన్న రాజన్న,జక్క లింబారెడ్డి,రైతు బంధు మండల కో ఆర్డనేటర్ నాగులపాల్లి రాజేశ్వర్,సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు కోటగిరి శ్రీకాంత్ చారి,ఎనుగందుల శ్రీనివాస్,ఎంబరి శరత్,సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తాకారోద్దీన్,వార్డు సభ్యులు గాండ్ల రాజేష్,తెరాస నాయకులు భూస నరహరి,పోలేపల్లి లక్ష్మీ నారాయణ,కాల చిన్న గంగారాం,ముప్పారం రాము,మద్దికుంట శ్రీకాంత్,షేక్ ఆరిఫ్,పిట్ల దయాకర్, వన్నెల్ బి రాజేశ్వర్,SP ప్రసాద్,దొన్కంటి రాజేశ్వర్,సంతోష్,నార్ల రాజు,మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి RI రాఘవేందర్,రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్,జూనియర్ అసిస్టెంట్ ఫయిమ్,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.