Saturday, 7 November 2026

బాసరలో గోదావరికి నదీహారతి

అలరించిన కోటి దీపోత్సవం

ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీకపౌర్ణమి సందర్భంగా బాసరలో గోదావరి తీరంలో నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర సరస్వతీ ఆలయం, వేదభారతి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు నదికి శాస్తోక్తంగా గోదావరికి పూజలు నిర్వహించారు. వేదభారతీ పీఠం నిర్వహిస్తున్న దక్షిణగంగా వేదనిత్యహారతి ఆరంభించి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రుషికన్యలతో చతుర్దశ భువన మహాహారతి నిర్వహించారు. ఇందులో భాగంగా కుంభ, నాగ, నక్షత్ర, కుష్మాండ, చక్ర, పుష్ఫ, ధాన్య, కాగడ తదితర 14 హారతులను నదికి నివేదించారు. రుషికన్యలు నిర్వహించిన హారతి కార్యక్రమాలతో పున్నమి వెలుగుల్లో గోదావరి తీరం ఆధ్యాత్మికతతో పులకరించింది. /బి/రిళి/ూంద ఆదిలాబాద్‌లో నిర్వహించిన కోటి దీపోత్సవంతో పట్టణం పులకరించింది. మహిళలు ఉత్సాహంగా దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలగించారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో గురువారం రాత్రి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి చేతులవిూదుగా ప్రారంభమైన ఈ వేడుక ఆద్యంతం భక్తిభావంతో సాగింది. వేదపండితుల వేదమంత్రోచ్చరణల నడుమ మహిళలు దీపాలను వెలిగించారు. శివకేశవులకు ఎంతో ప్రీతిప్రాయమైన ఈ కార్తీక మాసంలో ప్రతి మహిళ రోజూ వేకువజాము, సంధ్యవేళల్లో దీపారాధన చేయాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు డా.ప్రఫుల్‌వజే, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.