బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌
నిర్మల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కోవిడ్‌ సోకింది. వారిని ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. అది ఇతరులకు వ్యాపించింది. దీంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆరుగురికి కోవిడ్‌ ఉన్నట్లు నిర్దారించారు. దీంతో మిగతా విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు విద్యార్థులకు సూచించారు.