Tuesday, 3 November 2026

బిఆర్ఎస్ నాయకుడు నక్క లచ్చయ్య గుండెపోటుతో మృతి”సంతాపం తెలుపుతున్న మంత్రి జగదిష్ రెడ్డి

 

 

 

 

 

 

పెన్ పహాడ్ ఏప్రిల్ 28 (జనం సాక్షి) : మండల పరిధిలోని నాగుల పాటి అన్నారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నక్క లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి వారి భౌతికాయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు, కుటుంబ సభ్యులకు ప్రగడ సంతాపం తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ లచ్చయ్య లేని లోటు కుటుంబానికి పార్టీకి తీరంలోటు అన్నారు, సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, సూర్యాపేట జెడ్పిటిసి జీడి బిక్షం, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, పిఎసిఎస్ చైర్మన్ నా తల జానకిరామ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, జిల్లా నాయకులు మామిడి అంజయ్య, మండల యూత్ అధ్యక్షులు అనంతల శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు ధనియాకుల కోటమ్మ సత్యనారాయణ, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, మీసాల రమణ దేవయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు నకరికంటి భార్గవ్, మామిడి శోభన్, సోషల్ మీడియా రవి యాదవ్, తదితరులు పాల్గొన్నారు…