Tuesday, 3 November 2026

బిజెపి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు సరికావు.

 

 

 

 

చండ్రుగొండ జనం సాక్షి ఏప్రిల్ 29 : బిజెపి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు సరికావని ముస్లిం సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రసూల్ అన్నారు. తిప్పనపల్లి మసీదులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే  ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మత సామ్రాస్యానికి ప్రతీకైనా భారత దేశంలో ఇలాంటి మాటలకు తావు లేదని, హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే మాటలు అమిత్ షా మాట్లాడడం దురదృష్ట కరం అన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.