వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 28 (జనం సాక్షి)అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రెండవ రాష్ట్రమసభలు ఈనెల 25 26 27 తేదీలలో ఆలేరులో జరిగాయి. ఈ మహాసభలో నూతన కార్యవర్గమును ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా మామిడాల బిక్షపతి ప్రధాన కార్యదర్శిగా బి భాస్కర్ లతోపాటు 23 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రాచర్ల బాలరాజును ఎన్నుకున్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు ప్రజా విధానాలపై పలు తీర్మానాలు , భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నారని బాలరాజు తెలిపారు.




