Tuesday, 3 November 2026

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

జూలూరుపాడు, జనవరి 1, జనంసాక్షి: వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావిడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఆదివారం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా బాణాసంచా కాల్చుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద నూతన సంవత్సర కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సరం కొత్త ఆశలు, ఆలోచనలతో, ప్రజలు జీవితంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు. అంతేగాక పార్టీ శ్రేణులు సైతం పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, ఎంపీపీ లావిడియా సోనీ, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఎదళ్లపల్లి వీరభద్రం, జిల్లా నాయకులు లాకావత్ గిరిబాబు, రోకటి సురేష్, వేల్పుల నరసింహారావు, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, సర్పంచులు బానోతు శాంతిలాల్, భూక్య రాములు, లావిడియా కిషన్లాల్, కట్రం మోహన్ రావు, శాంతిరాం, బోజ్యా, నాయకులు ఎల్లంకి పుల్లయ్య, మాచినేని సత్యనారాయణ, మల్లెల నాగేశ్వరరావు, చాపలమడుగు రామ్మూర్తి, సపావాట్ నరేష్, తాళ్లూరి రామారావు, మోదుగు రామకృష్ణ, పనితి వెంకటేశ్వర్లు, భానోత్ ధర్మ, మోదుగు నరసింహారావు, ఎస్కే మైబు, ఇల్లంగి తిరుపతి, బుడిపుడి ప్రభాకర్, నవీన్, దేవిలాల్ రాంజీ పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.