జహీరాబాద్ ఏప్రిల్ 10( జనం సాక్షి) శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్,సిడిసి చైర్మన్ ఉమకాంత్ పాటిల్ తో కలిసి ఝరాసంగం మండల లోని 16 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూబిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష… బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపడుకుంటాం అని అన్నారు.మరోసారి అధికారం మనదే-కార్యకర్తలు కార్యదీక్షులయి ఇంటింటికి తిరిగి ప్రజలకి అభివృద్ధి-సంక్షేమ పథకాలని వివరించాలని మండల నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్,.మంత్రి వర్యులు కేటీఆర్ , ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి మరింత చైతన్య పరిచేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.ఆత్మీయ సమ్మేళనాలునాయకులు,కార్యకర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో దేశం లో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి – సంక్షేమ పథకాలు మన రాష్ట్రం లో అమలవుతున్నాయి అని అన్నారు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా చేస్తున్నామన్నారు.సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్దులకు వికలాంగులుకి ఆసరా పింఛన్లు అందిస్తున్నాము అన్నారు. కళ్యాణా లక్ష్మి, షాది ముభారాక్ పథకాల ద్వారా గౌరవంగా అడా బిడ్డల పెండ్లి కి సహాయం అందిస్తున్నాము అన్నారు.గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక విద్యార్థికి 1 లక్ష 20 వేయిల రూ.లు ఖర్చు చేస్తూ ఉచితంగా యూనిపర్మ్, పుస్తకాలు అందిస్తున్నామన్నారు.ప్రతి బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలం లో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించండి అన్నారు.మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ సార్ కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన ఒక సోదరునిల అండగా ఉంటానని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రచయ్యా స్వామీ, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, విజేందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సింలు పటేల్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు బొగ్గుల జగదీశ్వర్, మండల మైనారిటీ అద్యక్షుడు అజీజ్ , మండల యువత అద్యక్షులు సంజీవ్, రైతు సమన్వయ అద్యక్షులు సుభాష్ రావు, మాజీ సర్పంచ్ వెంకటేశం, సర్పంచ్ లు సంగయ్యా, ఒంప్రకష్ పాటిల్, పరమేశ్వర్, సంజీవ్, కిషన్, అమర్జిత్, సంగారెడ్డి, ఇంద్రమ్మ, ఎంపీటీసీ లు షేక్ హాపీజ్, రాజు, రాజుకుమార్, ఝరాసంగం టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ బాబా, నాయకులు మిథున్ రాజ్, ఇజ్రాయేల్ బాబీ, సంగన్న, సంతోష్ పాటిల్, నర్సింహ గౌడ్, ప్రభు పటేల్, సంతోష్ పాటిల్, వెంకట్ రెడ్డీ, కృష్ణ, ఫరూఖ్ పటేల్, శంకర్, సిద్దన్నా పటేల్, బాస్వరాజ్ పాటిల్, సంగారెడ్డి, పండరినాత్, నర్సింలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





