Thursday, 5 November 2026

మహారాష్ట్రలో ఆధ్యాత్మిక బోధనలు

 

 

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 13, (జనంసాక్షి) ,కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని బిచ్కుంద మఠాధిపతి సోమలింగ శివాచార్య మహాస్వామిజీ గురువారం భక్తుల కోరిక మేరకు మహారాష్ట్రలోని దేవాపూర్ గ్రామంలో అఖండ శివ నామా సప్తహా లో పాల్గొని ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని,దైవ చింతన కలిగివుండాలని తెలిపారు.ఇతరులకు హాని తల పెట్టరాదన్నారు. చేతనైన సహాయం చేయాలన్నారు. తల్లిదండ్రులను దైవం కన్నా మిన్నగా చూసుకోవాలన్నారు. వృద్ధులైన తల్లి దండ్రుల సేవలు చేయాలని తెలిపారు. భక్తుల స్వామిజీకి పూలదండలు వేసి సన్మానం చేశారు.