Wednesday, 4 November 2026

బిఆర్ఎస్ ,బీజేపీ లు రెండు ఒక్కటే

 

 

 

 

 

 

 

 

 

బచ్చన్నపేట ఏప్రిల్ 9(జనం సాక్షి):బిఆర్ఎస్ ,బి ఆర్ ఎస్ . బిజెపి పార్టీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు.ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. బి ఆర్ ఎస్. బిజెపి.ఒకరిని ఒకరు కాపాడుకుంటు తెర ముందు కొట్లాడినట్లు ,తెర వెనుక ఒప్పందం ప్రకారం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కాపాడుకోవడానికి పని పనిచేస్తున్నారని అన్నారు.పచ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలకు తెర లేపిండ్రు,అక్కడ నాలుగో ప్లేస్ లో ఉన్న బీజేపీ ని రెండో స్థానానికి వచ్చే ల చేసిన ప్రయత్నాలు ఇక్కడ చేయాలి అనుకుంటున్నారని ,దానిలో భాగమే ఇదంతా ,ఎవరైనా ఒకే రాష్ట్రంలో రెండు సార్లు ట్రైన్ లను ప్రారంభోత్సవం చేస్తారా,, లిక్కర్ స్కాం గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం ,మూడో ముద్దాయి గా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడు ,రెండో ముద్దాయి పిళ్లై జైల్లో ఉంటాడు, కానీ మొదటి నిందితురాలు మాత్రం నిర్దోషిగా బైట ఉన్నారని,ఇదంతా గేమ్ అని ప్రజలకు అర్ధం అవుతుంది, కాళేశ్వరం ఎటిఎం గురించి సప్పుడు చేయడు మూడు,నిన్న ప్రజల దృష్టి మరల్చడానికే సింగరేణి ధర్నా అని డ్రామాలు క్రెయేట్ చేశారు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి   కూడా పాలనను వొదిలేసి సొంత క్యాడర్ ని కాపాడుకోవడానికే పనిచేసుకుంటున్నారని అన్నారు ,మీరు కులాల కుంపటి తోటి ఎన్ని వర్గాలను సాంప్రదించిన ఇక్కడ  నమ్మే పరిస్థితి లో జనగామ ప్రజలు లేరని. జనగామ లో ఈ సారి పొన్నాల లక్మయ్యా  గెలుసుడు ఖాయం అని ,రాష్ర్టంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు