మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్9 అందం మరింత ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందని ప్రముఖ టాలీవుడ్ స్టార్ అక్కినేని అఖిల్ అన్నారు.ఆదివారం సైనిక్‌పురి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్వీ సెలూన్ అండ్ స్పాను అఖిల్,సినీతార సాక్షి వైద్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈకార్యక్రమానికి నేరెడ్ మెట్ డివిజన్ కార్పరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈసందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.ఎన్వీ సెలూన్ అండ్ స్పా చాలా లగ్జరీగా ఉందని, విభిన్నమైన బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సినిమా రంగంలో బ్యూటీ కేర్ తప్పనిసరి యని, యాక్టింగ్‌లో భాగంగా తను కూడా బ్యూటీ కేర్ తీసుకంటానని పేర్కొన్నారు.ఈ స్పా తనను చాలా ఆకట్టకుందని త్వరలో ఇందులోనే స్పెషల్ హేయిర్ కట్ చేయించుకుంటానని అన్నారు. బ్యూటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఇన్వీ సెలూన్ మరింత పురోభివృద్ధి సాధించాలని అఖిల్ ఆకాంక్షించారు. లగ్జరీ బ్యూటీ సెలూన్‌ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.సిటీలో ఇంతటి లగ్జరీ సెలూన్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.సెలూన్ ఎండి దీప మాట్లాడుతూ.అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులన్నీ తమ వద్ద అందుబాటులో ఉన్నాయనిమార్కెట్‌లోని బ్రాండ్లకు విభిన్నమైన,వినూత్నమైన సౌందర్య ఉత్పత్తులను అందిస్తున్నామని,బ్యూటీ రంగంలోని అధునాతన సాంకేతికతతో సేవలను కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.త్వరలో నగరములో మరిన్ని ఎన్వీ సెలూన్ అండ్ స్పా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపింది.సెలూన్‌ను ప్రారంభించేందుకు ఏజెంట్ మూవీ టీం రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ ప్రారంభోత్సవంలో సినీ దర్శకులు సురేందర్ రెడ్డి,ఐశ్వర్య రాజీవ్,రణధీర్ రెడ్డితో పాటు పలువురు సినీ ప




