Wednesday, 4 November 2026

బిఆర్క్ లో మెరిసిన సిఓఈ ఆణిముత్యాలు.

 

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, మే 25, (జనంసాక్షి )నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ)ప్రకటించిన జేఈఈ మెయిన్స్ బిఆర్క్ ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలతో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ విభాగంలో కళాశాల విద్యార్థి పొట్టల విష్ణు 97.82పర్సంటైల్ తో జాతీయస్థాయిలో 42వ ర్యాంకు సాధించాడు. అల్లూరి శివకుమార్ 96.28 పర్సంటైల్ తో జాతీయస్థాయిలో 86 వ ర్యాంకు సాధించాడు. కళాశాల నుండి ముగ్గురు విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా ముగ్గురూ క్వాలిఫై కావడమే కాకుండా జాతీయస్థాయిలో ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.
జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన బెల్లంపల్లి సిఓఈ మరోసారి తన సత్తాను చాటు చాటుకున్నదని ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా దేశంలోనే అత్యున్నతమైన ఐఐటి లో బిఆర్క్ లో ఇద్దరికి సీటు వస్తుందని ఆయన తెలిపారు.
గతంలోనూ బిఆర్కులో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఎన్ ఐ టి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇలా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బిఆర్క్ లో జాతీయస్థాయిలో రాణించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

– ఎంసెట్ లోనూ ఉత్తమ ర్యాంకులు.

గురువారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో సిఓఈ విద్యార్థులు ఉత్తమంగా రాణించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 30 మంది పరీక్షకు హాజరు కాగా 29 మంది క్వాలిఫై అయ్యారు . వీరిలో ఎస్ వినయ్ 11058 (పదకొండువేల యాబై ఎనిమిది)ర్యాంకుతో కళాశాల టాపర్ గా నిలిచాడు. అగ్రి విభాగంలో 29 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా అందరూ క్వాలిఫై అయ్యారు. వీరిలో బొట్ల రాము 10634 (పదివేల ఆరువందలముప్ఫై నాలుగు) ర్యాంకుతో టాపర్ గా నిలిచినట్లు ఆయన తెలిపారు.

-ర్యాంకర్లకు ఆర్సీఓ అభినందన.

జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి సంక్షేమ గురుకులాల సత్తాను చాటిన సిఓఈ విద్యార్థులను ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి ఫోన్ ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా అధ్యాపకుల కృషి విలువ కట్టలేనిదని ఆమె అన్నారు. కళాశాలను ఉన్నత స్థాయిలో నిలబెడుతూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపల్ సైదులు ను ప్రత్యేకంగా అభినందించారు.