రఘునాథ పాలెం జూన్ 04 (జనం సాక్షి) ఒడిస్సా లోని బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో మరణించిన ప్రయాణికులకు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ సంతాపం తెలియజేశారు రైలు ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అనేకమంది గాయపడటం అత్యంత బాధాకరమని తన మనసును కలిచివేసిందని ఆయన తెలియజేశారు చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల అంగవైకల్యం చెందిన వారికి పది లక్షలు రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లింగాల విజ్ఞప్తి చేశారు ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అత్యంత టెక్నాలజీతో ముందుకు పోతున్న తరుణంలో ఇ లాంటి సంఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైల్వే ప్రమాద ఘటనకు చింతిస్తూ చనిపోయిన ప్రయాణికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నేడు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని ఆయన తెలియజేశారు
బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు




