బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను సాధించుకొనుటకు ముందుండాలని పిలుపునిచ్చిన రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు కొండమల్లేపల్లి జనవరి 11 జనం సాక్షి న్యూస్ : నేడు మాలల ముఖ్య కార్యకర్తల సమావేశం దేవరకొండ పట్టణం లోని బంజారా భవనంలో మాల మహానాడు దేవరకొండ డివిజన్ అధ్యక్షులు బయ్య వెంకయ్య అధ్యక్షతన బహుజన మేధావి , అంబేద్కరిస్ట్ యేకుల రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మాలమహానాడు జాతీయ అద్యక్షులు తాళ్ళపల్లి రవి, రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు , రాష్ట్ర మహిళ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం మరియు నలగొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ సూర్యాపేట అధ్యక్షులు కందుల వీరబాబు మరియు జిల్లా నాయకులు, డివిజన్ మండలాల నాయకులు పాల్గొన్నారు. అంతరం జాతీయ అధ్యక్షులు తళ్ళపల్లి రవి మాట్లాడుతూ రాష్ర్టంలో మాలలంతా ఏకమై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను సాధించుకొనుటకు ముందుండాలని పిలుపునిచ్చారు. విధంగా అన్ని రంగాలలో మాలలు ముందుండి సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆర్థిక, రాజకీయ, రంగాలలో మాలలకు అవకాశం కల్పించాలన్నారు. అదేవిధంగా ముందు రోజుల్లో అన్ని మండలాలలో గ్రామాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో భారీ మాల బేరిని నిర్వహిస్తామని అన్నారు. బీసీ, యస్సి, ఎస్టీ, లు రాజ్యాధికారం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, కార్యదర్శి మేకల చెన్నకేశవులు, రాష్ట్ర మహిళ కార్యదర్శి రమణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూతం అర్జున్, డివిజన్ ఉద్యోగ సంఘ నాయకులు జీవన్ సాగర్, పెరుమళ్ళ హరి, మర్రిగూడ మండల అధ్యక్షుడు నగిల్ల మరయ్య, పి. ఏ. పల్లి మండల అధ్యక్షుడు రెడ్డిమల్ల రవి, డిండి మండల అధ్యక్షులు అవుట మల్లేష్, నియోజకవర్గం నాయకులు యేకుల సురేష్, పెరుమళ్ల వినోద్ , మేడ సైదులు, చంద్రమొలి, యేకుల అంబెడ్కర్, బూతo సైదులు, మండల శివ, నరేష్, ఏనిక వెంకన్న, మాజీ సర్పంచ్ గండిమళ్ళ కాంతయ్య, చేపురి రాజేష్, ముత్యం, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తళ్ళపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను సాధించుకొనుటకు




