Friday, 6 November 2026

బిఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి కుమార్.

బిఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 28(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాల్లో బిఎస్పీ పార్టీ బలోపేతమే పరమావదిగా అహర్నిశలు కృషి చేస్తున్న బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ ను జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డారని ఆ పార్టీ తాలూకా నాయకులు పృథ్వీ రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ,బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సూచించారని అన్నారు.ఈ నెల 26న డా.ఆర్.ఎస్పీ చేతుల మీదుగా కొత్తపల్లి కుమార్ జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్నారని తెలిపారు.జిల్లా అధ్యక్షులు గా కొత్తపల్లి కుమార్ ను నియమించి నందుకు జిల్లా బిఎస్పీ పార్టీ కార్యకర్తల తరఫున, బహుజన సైన్యం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలిపుతున్నాని పృథ్వీ రాజ్ తెలిపారు.