విద్యార్థులకు స్టేషనరి పంపిణీ.
నెన్నెల, నవంబర్ 28, (జనంసాక్షి )
మండలంలోని కొత్తూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు స్టేషనరి పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు రవి, ఉపాధ్యాయురాలు జ్యోతి సహకారంతో విద్యార్థులకు నోటు బుక్కులు, ఎగ్జామ్ ఫ్యాడ్ లు, పెన్నులు, పెన్సిల్లు సర్పంచ్ ఎనుక మల్లయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వీరు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర కుమార్, ఉపాధ్యాయులు రేణుకా దేవి, రాజ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్టేషనరి పంపిణీ.




