Wednesday, 4 November 2026

శాంతినగర్ లో   20 ఏళ్ల క్రితం కొన్న ఈద్గా భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న నాయకుడు

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 11 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గత 20 సంవత్సరముల క్రితం  ఈద్గా  కొరకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మున్నాభాయ్ అన్నారు. ఆ నాయకుని మీద నమ్మకం తో  రిజిస్ట్రేషన్ చేసుకోలేదనీ, అదే అవకాశంగా భావించిన ఆ పెద్దమనిషి ఇప్పటికీ ముస్లిం సామాజిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడనీ,ఇటువంటి సమస్యలు అల్లంపూర్ నియోజకవర్గం లో కోకొల్లలుగా ఉన్నాయనీ,ఎమ్మెల్యే అబ్రహం కి ఇటువంటి సమస్యలు పట్టానే పట్టవు ముస్లిం సామాజిక వర్గం ఓట్లు వేసే మిషన్ లాగా వీరికి కనిపిస్తారనీ,ప్రజలకు వీళ్లు  ఇన్ని ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికలలో వీళ్లకు గుణపాఠం చెప్పక  తప్పదనీ,ఈద్గా సమస్యను పెద్దమనుషులు అలాగే ముస్లిం సామాజిక వర్గం తో కలిసి న్యాయంగా ఎవరికి చెందే భూమి వారికి చెందే విధంగా చేస్తారని ఆశిస్తున్నామని,సమస్య పరిష్కారం కాకుంటే వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామనీ,ఈ విషయం మా  నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ  దృష్టికి కూడా తీసుకొని వెళ్లడం జరిగిందనీ,ముస్లిం సామాజిక వర్గాన్ని ఓట్ల మిషన్ లాగా భావించకండనీ,డాక్టర్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఎలా ఇచ్చారో ముస్లిం సామాజిక వర్గానికి కూడా అవే హక్కులు వర్తిస్తాయని,ఈ సమావేశంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎంఐఎం జిల్లా జనరల్ సెక్రెటరీ అల్తాఫ్ హుస్సేన్,జిల్లా ట్రెజరర్ జాకీర్ హుస్సేన్,మీడియా ఇంచార్జ్ సులేమాన్ ఖాద్రి,అలంపూర్ నియోజకవర్గం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సయ్యద్ కలీముల్లా,టౌన్ అధ్యక్షులు  కవితమ్మ,మనోహర్,శివ,యూసుఫ్,తిమ్మప్ప,కేశన్న తదితరులు పాల్గొన్నారు.