Tuesday, 3 November 2026

బిచ్కుందలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బిచ్కుందలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతినౌషా నాయక్ఎంపీటీసి అవార్ సాయిలు
బిచ్కుంద ఏప్రిల్ 05 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో బుధవారం నాడు బిచ్కుంద బంజారా సంఘం అధ్యక్షుడు నౌషా నాయక్ మరియు ఎంపీటీసి అవార్ సాయిలు తుకారాం పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు ఆయన చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలు వేసి  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధాని మహా నాయకుడు బహుజనుల కొరకు తన ఒక రాజకీయ రాజకీయ జీవితం 50 సంవత్సరం ఎనలేని పోరాటం చేస్తూ రాజకీయంలో కార్మిక మంత్రిగా అనేక పదవులు చేస్తూ బడుగు బలహీన జాతి కొరకు పోరాటాలు చేసిన బాబు జగ్జీవన్ రామ్ యొక్క జయంతిని భారత దేశంలో అధికారికంగా చేయడం సంతోషమని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జుక్కల్  అసెంబ్లీ అధ్యక్షుడు ఈభత్వార్ తుకారం బంజారా సంఘం అధ్యక్షుడు నౌషా నాయక్, ఎంపీటీసీ అవార్ వార్ సురేష్, వార్డ్ మెంబర్ జి గంగారం, లాలు, సురేష్, వీరయ్య, మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.