Tuesday, 3 November 2026

బిచ్కుందలో బగోన దొంగ దొరికెనా?

బిచ్కుంద జులై 03 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల కింది గల్లిలో గత కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం ఇదార కొనసాగేది. దాంట్లో చిన్న పిల్లలకు పలువురు అరబ్బీ ఖురాన్ నేర్పించేవారు. వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు పిల్లలు రాక ఇదార మూతబడింది. అయితే ఇదే అదునుగా భావించి ఎవరు అడగరనే దుస్సాహసంతో ముస్లిం పెద్దల నిర్లక్ష్యం వల్లనో, ఐక్యత లేకనో ఆ ఇదారలో ఉన్నటువంటి అండలు గంజులు గంటలతో పాటు అనేక రకాలైన వంట సామాగ్రి దొంగతనంతొ ఎవరొ అమ్ముకున్నారు. ఒక పార్టీకి చెందిన నాయకుడు అమ్మేసాడని జనంలో గుసగుసలాడుతున్నాయి. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి శిక్ష విధించి తగిన జరిమానా విధించాలని యువకులు కోరుతున్నారు. అంతేగాకుండా వక్ఫ్ బోర్డు భూములకు కూడా నిఘా కరువైందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారంలో ఉన్న ప్రభుత్వం కులమతాలకు అతీతంగా కులసంఘాల భవనాలకు లక్షల రూపాయల వ్యయం వెచ్చిస్తోంది. కానీ ముస్లిం నాయకుల నిర్లక్ష్యం కారణంగా కనీసం ఉర్దూ ఘర్ కానీ మైనారిటీ సంఘం భవనం కూడా నిర్మించలేకపోయారు. ఓ నాయకుడైతే ఏకంగా అధికార మదంతో డబ్బుల దాహంతో నామమాత్రపు పనులు చేసి వక్ఫ్ బోర్డు డబ్బుల పేరిట లక్షల రూపాయల బిల్లులు సృష్టించి వృధా చేస్తున్నట్లు పక్కా సమాచారం.