Tuesday, 3 November 2026

సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 3. (జనంసాక్షి). అర్హులేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిరుపేదలు కలెక్టరేట్ కు తరలివచ్చారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పంతం రవి సామల మల్లేశం మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కడారి రాములు, వేణు, రమేష్ పలువురు నిరుపేదలు పాల్గొన్నారు.