Wednesday, 4 November 2026

బిజెపికి ఎంతకు అమ్ముడు పోయావ్‌

పవన్‌పై వర్ల విసుర్లు

అమరావతి,జూలై21(జ‌నం సాక్షి): విపక్ష నేతలు జగన్‌, పవన్‌ కళ్యాణ్‌పై టిడిపి నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ ట్విట్టర్‌ వీరుడు పవన్‌కళ్యాణ్‌ అవిశ్వాసం తీర్మానంపై లోక్‌సభలో చర్చ పూర్తవకుండానే ట్వీట్లు పెట్టారని విమర్శించారు. ‘బిజెపికి ఎంతకు అమ్ముడు పోయావు పవన్‌.. దమ్ముంటే నిజం చెప్పు’ అంటూ సవాల్‌ విసిరారు. అవిశ్వాస తీర్మానం నుంచి పారిపోయిన పిరికివాడు జగన్‌ అని వర్ల వ్యాఖ్యానించారు. మోదీని నిలదీయాల్సి వస్తుందనే వైసిపిఎంపిలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. జగన్‌ లాంటి పనికిమాలిన నాయకుడు ప్రజలకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. చిల్లర నాయకుడు పవన్‌, దొంగల నాయకుడు జగన్‌ అంటూ వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

—————–