విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాన్ని కలిగి ఉండాలి..
– జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు జిల్లా క్రీడాకారుడు..
– జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి యాదయ్య గౌడ్.
ఊరుకొండ, నవంబర్ 14 (జనంసాక్షి):
విద్యార్థులు చదువుతోపాటు క్రీడ నైపుణ్యాన్ని కలిగి ఉండాలని.. క్రీడల ద్వారానే శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెంపొందిస్తాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, ఊరుకొండపేట పీఈటీ యాదయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 12తేది వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన 48వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఎం.సందీప్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ జట్టు తరుపున పాల్గోని అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైయ్యాడని తెలిపారు. క్రీడాకారుడు సందీప్ రెడ్డి ఈనెల 17 నుండి 20వ తేదీ వరకు హరిద్వార్ లోని రిషికేశ్ లో జరుగుతున్న 48వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్రజట్టు తరపున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారున్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి అధ్యక్షులు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సీతారాం, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ క్రీడాకారుడు హేమంత్ తదితరులు అభినందించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.




