బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డికి వాసవి మాత గుడి కుల్చివేతపై వినతిపత్రం.

ఈరోజు వనపర్తి పట్టణంలో బిజెపి ఆఫీస్ లో వనపర్తి జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి కి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎంతో పురాతనమైనది, మరియు శక్తివంతమైనది, కావున హిందువులకు ఆరాధ్య దైవం అయిన అమ్మవారి గుడిని రోడ్డు వెడల్పు లో భాగంగా మినహాయించి , కాపాడాలని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ మేము ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. మరియు బిజెపి మాజీ వైస్ చైర్మన్ అయిన బీ కృష్ణ  కూడా మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని,వారు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సభ్యులు, వెంకటేష్ గోవిందు, భూపేష్, భరత్, చందు, శంకర్, తదితరులు హాజరు కావడం జరిగింది.

తాజావార్తలు