బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు

బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు
కెసిఆర్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి

సిద్దిపేట,జూలై11(జనం సాక్షి): ఉమ్మడి ఎపిలో తెలంగాణలో అన్నివర్గాలకు అన్యాయమే జరిగిందని, ఎరువులు, విత్తనాలు, కరెంటు కోసం రోడ్లెక్కిన విషయం తెలిసిందేనని అటవీ అభివృద్దిశాఖ ఛైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి ఎన్నో కొత్త పథకాలను తెచ్చిన కేసీఆర్‌ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారన్నారు. ఇంటింటికి మంచినీరు, నిరంతర కరెంట్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌ ఘనత అన్నారు. ఉనికికోసమే కాంగ్రెస్‌,బిజెపి నేతలు సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కావాలనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌ ప్రశ్నలకుముందు బిజెపి నేతలు సమాధానం ఇవ్వాలన్నారు. స్వార్థరాజకీయాల కోసమే బిజెపి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఉనికిని చాటుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో
ఆంధ్ర ప్రాంత నాయకులకు వంత పాడుతూ తెలంగాణకు ద్రోహం చేసిన విషయం ప్రజలు ఇంకా మరచిపోలేదని తెలిపారు. రాష్ట్రంలో అబివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వంటేరు విమర్శించారు. కెసిఆర్‌ జాతీయ రాజకీయాలతో బిజెపిని దునుమాడడం ఖాయమన్నారు. బిజెపి డ్రామాలు ఇక బయటపడతాయని అన్నారు.