Wednesday, 4 November 2026

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కొండా మణెమ్మ నియామకం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ మాజీ జెడ్పిటిసి కొండ మణెమ్మ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియామకం అయ్యింది.రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియామక పత్రాన్ని అందజేసి నట్లు కొండ మణెమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను కించపరుస్తూ ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు క్యాబినెట్లో కూడా అనేక మందికి అవకాశాలు కల్పించాలని మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బండారాన్ని బయటపెట్టి రాబోయే ఎన్నికలలో ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు జిల్లా ఇన్చార్జి కొల్లు మాధవి తో పాటు జాతీయ రాష్ట్ర జిల్లా నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.